ఏరియా ఆసుపత్రి ఐసీటీసీకి జాతీయస్థాయి పురస్కారం

UPDATED 2nd NOVEMBER 2018 FRIDAY 9:00 PM

పెద్దాపురం: పెద్దాపురం ఏరియా ఆసుపత్రి  ఐసీటీసీ విభాగం ఉత్తమ నిర్వహణకు సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థకు జాతీయస్థాయి పురస్కారం లభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికాంత్ తెలిపారు. ఈనెల ఒకటవ తేదీన విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఉప సంచాలకులు డాక్టర్‌ నరేష్‌ గోయల్‌, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ అదనపు సంచాలకులు డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ చేతులు మీదుగా పెద్దాపురం ఎరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికాంత్‌, ఐసీటీసీ కౌన్సిలర్‌ బి. శ్రీనివాస్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సిహెచ్. రామకృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ బొడ్డు బంగారుబాబు, వైద్యులు వర్మ, విజయమోహన్‌, రాధ, దీపిక, గుప్త, అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us