Akhilesh Yadav: నా హెలికాప్ట‌ర్ టేకాఫ్ కు ఎందుకు అనుమ‌తించ‌లేదు

Updated 28 January 2022 Friday 06:30 PM

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్): స‌మాజ్ వాదీ పార్టీ (SP)అధ్య‌క్షులు అఖిలేశ్ యాద‌వ్ బీజేపీపై తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ కు హెలికాప్ట‌ర్ లో వెళ్లేందుకు సిద్ద‌మైతే త‌న హెలికాప్ట‌ర్ టేకాఫ్ కు అనుమ‌తించలేద‌ని తన ట్విట్టర్ వేదికగా అఖిలేశ్ యాద‌వ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ ఓటమి కుట్రగా ఆయన చెప్పారు. ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు హెలికాప్టర్ లో వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్ రెడీ అయ్యారు. కానీ తన హెలికాప్టర్ టేకాఫ్ కు అనుమతించలేదని ఆరోపించారు. బీజేపీకి చెందిన ఓ నాయకుడికి అదే ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో వెళ్లడానికి అనుమతించారని తెలిపారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ట్వీట్ చేశారు. ఎంత చేసినా.. 2022 లో జరిగే ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించడం ఖాయమని అఖిలేశ్ యాద‌వ్ ధీమా వ్యక్తం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us