18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

* కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి
* ఆదిత్యలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

UPDATED 25th JANUARY 2021 MONDAY 8:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలొ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదిత్య గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆదిత్య ఇంజినీరింగి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్రమంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వారే దేశాన్ని పరిపాలించే వ్యవస్థ అని, ఎన్నుకునే అవకాశమిచ్చేది ఓటు హక్కు అన్నారు. అలాంటి దానిపై నిర్లక్ష్యం తగదని, అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలు, పనితీరును అంచనా వేసుకుని, ఓటేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీలలో కె. సంతోష్, రామలక్ష్మి విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి కె. అశోక్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. బుజ్జిబాబు, గ్రంధాలయ సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us