పంచారామ క్షేత్రంలో సౌమ్య మిశ్రా పూజలు

UPDATED 31st AUGUST 2018 FRIDAY 6:00 PM

సామర్లకోట: సామర్లకోటలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి దేవాలయంలో ఓడిశా రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారిణి డాక్టర్ సౌమ్య మిశ్రా స్వామి, అమ్మ వారిని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు తొలుత అమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us