UPDATED 11th JULY 2018 WEDNESDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సి.ఎన్.సి. మాన్యుఫాక్చరింగ్ అనే అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎమ్..శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా డాక్టర్ పి. నాగేశ్వరరావు పాల్గొని 80 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మెళుకువలు నేర్పారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన విధానాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి, డాక్టర్ వి.వి.ఎస్. కామేష్ పాల్గొన్న కార్యక్రమానికి పి.వి.ఎల్.ఎన్. రాజు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం డాక్టర్ పి.ఎన్. రావును ఆదిత్య యాజమాన్యం దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.







