UPDATED 16th MAY 2019 THURSDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్నఎన్.సి.సి కంబైన్డ్ ఏన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో భాగంగా గురువారం కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ డిఎస్ రావు, డిప్యూటీ కమాండెంట్ లెఫ్టినెంట్ ఏఎస్ రాణా (ఎన్.సి.సి-కాకినాడ) ఆధ్వర్యంలో క్యాడెట్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ శిక్షణా తరగతులకు గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ కెవి శ్రీనివాస్, మాజీ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎల్.సి.ఎస్. నాయుడు ముఖ్య అతిధులుగా హాజరై ఎన్.సి.సి విద్యార్థులకు నిర్వహిస్తున్న క్యాంపు శిక్షణా తరగతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్.సి.సి క్యాడెట్లు భవిష్యత్తులో త్రివిధ దళాల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి, విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఈ క్యాంపు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ క్యాంపు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు.







