చిన్నారి కుటుంబ సభ్యుల వివరాలు లభ్యం

UPDATED 31st JULY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద వైన్ షాప్ సమీపంలో ఏడాదిన్నర వయస్సు గల ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరపగా రాజానగరం సమీపంలో నివాసం ఉంటున్న కాండీ రాజు, దుర్గలను చిన్నారి తల్లిదండ్రులుగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా చిన్నారి తల్లి గత కొంతకాలంగా సామర్లకోటలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తోందని, దుర్గ అలసిపోయి పడుకున్న సమయంలో చిన్నారి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం పోలీస్ స్టేషనుకు ఫిర్యాదు చేసే నిమిత్తం వచ్చిన దుర్గ తన పాపను తనకు అప్పగించాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us