ఆదిత్య వైస్ ప్రిన్సిపాల్ కు సాంకేతిక నిపుణి అవార్డు

UPDATED 24th OCTOBER 2017 TUESDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరిజిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాశ్రీ కి మలేషియాకు చెందిన సంస్థ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రొఫెషనల్ మలేషియా ( ISRPM) సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫెషనల్ అవార్డుతో సత్కరించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తమ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పలు హోదాలలో దశాబ్ద కాలానికి పైబడి సేవలందిస్తున్న రమాశ్రీ కి ఈ అవార్డు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ  చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఎ. రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, డాక్టర్ దివాకర్, డాక్టర్ ఎన్. విశాలాక్షి, వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ శాఖల విభాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు అభినందించారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us