UPDATED 14th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామానికి చెందిన గంటా సత్యవతి వైద్య చికిత్స నిమిత్తం రూ.33 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం ఆమెకు అందచేశారు. గ్రామ టిడిపి అధ్యక్షుడు చల్లా బుజ్జి ఆమె అనారోగ్య పరిస్థితి గురించి హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో మంత్రి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, తదితరులు పాల్గొన్నారు.







