UPDATED 12th OCTOBER 2018 FRIDAY 9:00 PM
రాజానగరం: రాజానగరంలోని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఓరియెంటేషన్ దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిసిఐ ఈసి మెంబర్ డాక్టరు కె. సతీష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ నిష్ణాతులైన అధ్యాపకుల విద్యా భోధనతో విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని అన్నారు. విద్యార్థులు దంత వైద్య రంగంలో నైపుణ్యం సాధించి భవిష్యత్తులో మంచి దంత వైద్యులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థులు తాము ఎన్నుకున్న రంగంలో విజయం సాధించే దిశగా కృషి చేయాలని అన్నారు. విద్యార్థి దశలో తాను ఎదుర్కొన్న ఒడుదుడుకులు, సాధించిన విజయాలు గురించి విద్యార్థులకు సవివరంగా వివరించారు. కళాశాల సెక్రటరీ వై. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. తమ కళాశాలలో నిర్వహిస్తున్న గూగుల్ క్లాస్ రూమ్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, డైరెక్టర్ పి.జి. స్టడీస్ డాక్టర్ బి. లక్ష్మణరావు, డైరెక్టర్ ఎ. ప్రసాద్ చౌదరి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, పారాసైకాలజిస్ట్ జగన్మోహనరావు, డాక్టర్ కె. శ్రీదేవి, వివిధ విభాగాల అధిపతులు, మొదటి సంవత్సరం విద్యార్థినీ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.







