UPDATED 15th SEPTEMBER 2018 SATURDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రిడ్స్ 2కె18లో భాగంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఎరుడిట్ 2కె18 శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ బి. మీరాసాహిబ్ (ప్రొఫెసర్ మెకానికల్ విభాగం, జెఎన్టీయుకె, కాకినాడ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ ప్రెజంటేషన్లు, పోస్టర్ ప్రెజంటేషన్లు విద్యార్ధుల ప్రతిభను వెలికి తీయడానికి ఉపయోగపడతాయని అన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యలో విద్యార్ధుల సాంకేతిక నైపుణ్యాన్ని తెలియచేయడానికి ఇటువంటి సాంకేతిక సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యలో ప్రయోగాత్మక పరిజ్ఞానం విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని, నేడు ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ తెలియచేశారు. ఈ సందర్భంగా మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ పి. కుమార్ బాబు మాట్లాడుతూ 40 పేపర్ ప్రెజంటేషన్లు, 25 పోస్టర్ ప్రెజంటేషన్లు,18 మోడల్ ఎక్స్ పోలు, 29 టెక్నికల్ క్విజ్ లు,15 కాంట్రాప్షన్ ప్రెజంటేషన్లు,33 హైడ్రో రాకెట్ ప్రెజంటేషన్లు,14 ఆర్ట్ గాలరీలు,31 రోబో మారియోలు,23 రోబో సోకర్స్,16 ఏకాంబోట్లు, వివిధ స్పాట్ ఈవెంట్లు నిర్వహించారని తెలియచేశారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా డాక్టర్ కె. కృష్ణభాస్కర్, వి. వరప్రసాద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జెఎన్టీయుకె, కాకినాడ), కోఆర్డినేటర్లుగా జి.వి.ఎన్. సంతోష్, ఎం.అమృత (అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మెకానికల్ ఇంజనీరింగ్) వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







