కరోనా సహాయక చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలి

రంపచోడవరం(రెడీబీ న్యూస్): కరోనా సహాయక చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. అవేర్ సంస్థ సమకూర్చిన మాస్కులు, శానిటైజర్లు,వాటర్ బాటిళ్లు, గ్లౌజులు మొదలయినవాటిని ఎమ్మెల్యే చేతులమీదుగా రంపచోడవరం సర్కిల్ ఇనస్పెక్టర్ వెంకటేశ్వరరావుకు శుక్రవారం ఆమె అందజేశారు. వాటిని డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి పంపిణీ చేయనున్నారు.ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ ఇనస్పెక్టర్ దుర్గాప్రసాద్, వైసిపి నాయకుడు రామన్న దొర,కార్యకర్తలు,పోలీస్ సిబ్బంది,అవేర్ సంస్థ జిల్లా మేనేజర్ ఉదయ్ కుమార్ సంస్థ డివిజన్ కోఆర్డినేటర్ ఫణికుమారి,అశోక్,శివ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us