UPDATED 25th JANUARY 2021 MONDAY 7:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్ సోమవారం శిక్షణ పొందారు. ఆర్డీవో ఎస్. మల్లిబాబు ఆమెకు పాలన, ప్రభుత్వపరమైన అంశాలు, అలాగే ప్రజా సంక్షేమ పథకాలు తదితర విషయాలను ఆమెకు వివరించారు. రెవిన్యూకు సంబంధించిన అంశాలను ఆమె ఆర్డీవోను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రంగంపేట తహసీల్దార్ కార్యాలయంలో మండలస్థాయిలో శిక్షణ తీసుకున్నానని, ఇప్పుడు డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయంలో శిక్షణ పొందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సుమారు 15 రోజులపాటు పలు అంశాలపై ఇక్కడ శిక్షణ పొందనున్నట్లు ఆమె పేర్కొన్నారు.







