ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

UPDATED 28th FEBRUARY 2019 THURSDAY 5:30 PM

పెద్దాపురం: ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిపేందుకు అన్ని చర్యలూ తీసుకోవడంతోపాటు,  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయడానికి పోలీసు, రెవిన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో ఎస్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పోలీసు, రెవిన్యూ, మునిసిపల్ అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత సార్వత్రిక, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను ఆర్డీవో పోలీసుశాఖ అధికారుల నుంచి సేకరించారు. ఈనెల 24వ తేదీ నుంచి నియోజక వర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార హోర్డింగులు తొలగించడం, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయడం, తదితర అంశాలపై మున్సిపల్ కమీషనర్ నుంచి వివరాలు రాబట్టారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలో ఉన్న 211 పోలింగ్ కేంద్రాలను పోలీస్, రెవిన్యూ, సెక్టార్ అధికారులు పరిశీలించిన పిమ్మట ప్రజా సేకరణ ద్వారా తయారుచేసిన నివేదికను కంప్యూటర్ లో పొందుపరిచిన వాటిపై అధికారులతో ఆర్డీవో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చిలకా వెంకట రామారావు, పెద్దాపురం సిఐ యువకుమార్, సామర్లకోట ఎస్సై కిషోర్, పెద్దాపురం మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, పెద్దాపురం, సామర్లకోట తహసీల్దార్లు కె. గోపాలకృష్ణ, నరసింహారావు, మున్సిపల్ టిపీవో భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us