పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

UPDATED 5th JUNE 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ (సుగర్స్ డివిజన్) ప్రోసెస్ మేనేజర్ ఆకుల సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక నవభారత్ వెంచర్స్ లిమిటెడ్(సుగర్స్ డివిజన్) ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పర్యావరణాన్ని కాపాడకపోతే భవిష్యత్తరాలకు ప్రమాదకర పరిస్థితులు ఉంటాయన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్రతీ వస్తువు తిరిగి వినియోగించుకునేలా ఉండాలన్నారు. ప్రకృతిని మనం కాపాడితే మనలను ప్రకృతి కాపాడుతుందన్నారు. మార్పు అనేది సమాజం నుంచి రావాలన్నారు. కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, మొక్కలు విరివిగా నాటడం, వృక్షాలుగా పెంచడం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం అందరి అభిమతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ రామారావు నాయుడు, కాకర్ల గంగాధర్ నరేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us