UPDATED 14th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: ఈ నెల 15 నుంచి అమరావతిలో జరగనున్న అండర్ 17 రాష్ట్రస్థాయి సిఎం కప్ కబడ్డీ పోటీలకు స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.మణికంఠ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఈనెల 12,13 తేదీలలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి మణికంఠ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ, వ్యాయమ ఉపాధ్యాయుడు తాళ్ళూరి వైకుంఠం, తదితరులు అభినందించారు.







