అతిరాత్ర మహాక్రతువు యాగశాలల నిర్మాణానికి ముహూర్తపు రాట

UPDATED 29th MARCH 2018 THURSDAY 6:00 PM

పెద్దాపురం: నాలుగువేల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన అతిరాత్ర ఉత్క్రుష్ట  శ్రౌత సోమయాగ మహాక్రతువు యాగశాలల నిర్మాణానికి గురువారం ముహూర్తపు రాటను వేశారు. యాగకర్త కేశాప్రగడ హరిహరనాథ శర్మ పర్యవేక్షణలో యాగానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా నుంచి తీసుకు వచ్చిన పోకచెట్టు స్తంభాలతో యాగశాలల నిర్మాణానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి ముహూర్తపు రాట వేసి పనులు ప్రారంభించారు. ఏప్రిల్ 14 నుంచి 12 రోజులు పాటు నిర్వహించనున్న యాగానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు యాగకర్త హరిహరనాథ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ యాగకర్త కేశాప్రగడ రాజశేఖరశర్మ, బొగ్గవరపు రామకృష్ణ, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us