UPDATED 13th NOVEMBER 2018 TUESDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఎన్.ఎస్.వి.ఎన్. రాజుకు ఒరిస్సాలో గల సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (డాక్టరేట్) పొందినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఎన్.ఎస్.వి.ఎన్. రాజు సమర్పించిన A study on the Factors Influencing Investor’s Decision towards Investment In Equity Shares: Selected Districts of Andhra Pradesh అనే థీసిస్ కు ఈ డాక్టరేట్ లభించిందని తెలిపారు. తమ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా సేవలందిస్తున్న ఆయన మరింత మందికి మార్గదర్శకంగా నిలవాలని, విద్యార్థులకు చక్కటి మార్గ నిర్దేశకత్వం చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సతీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు ఎన్.ఎస్.వి.ఎన్. రాజును అభినందించారు.







