నట్టల నివారణకు వాక్సినేషన్

UPDATED 16th AUGUST 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: ప్రస్తుత సీజన్లో మేకలు, గొర్రెల్లో వ్యాపించే నట్టలను నివారించేందుకు పశుసంవర్ధక శాఖ చేపడుతున్న వాక్సినేషన్ కార్యక్రమాలను మేకలు, గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి. లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక మండల పశు వైద్యకేంద్రంలో నట్టల నివారణ వాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నట్టల నివారణ వాక్సినేషన్ వల్ల మేకలు గొర్రెల్లో వచ్చే వ్యాధులను రాకుండా నివారించవచ్చని అన్నారు. ఇంతవరకు  సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఈ వ్యాక్సిన్లు పంపిణీ చేయడం జరిగేదని, ఇక నుంచి సంవత్సరానికి మూడు సార్లు ఈ వ్యాక్సిన్లు అన్ని పశువైద్య కేంద్రాలలో వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 25 వరకు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, గొర్రెలు, మేకల పెంపకందారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏడీ డాక్టర్ మృణాళిని, ఏడీలు డాక్టర్ వరప్రసాదరావు, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ డిబిఆర్ అంబేద్కర్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ పి.మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us