క్యాట్ లో సత్తా చాటిన ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థి

UPDATED 5th JANUARY 2019 SATURDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఎంఏఎం విభాగంలో డిగ్రీ చదువుచున్న శ్రేష్ఠ ఫోమ్ర కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 98.55% మార్కులు సాధించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు సమానంగా వివిధ విభాగాలలో నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాలు సాధిస్తున్నారని అన్నారు. విద్యార్థులు అత్యుత్తమ క్యాట్ వంటి పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడంలో అధ్యాపకుల పాత్ర వెలకట్టలేనిది ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, అధ్యాపక బృందం, తదితరులు అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us