UPDATED 13th DECEMBER 2018 THURSDAY 6:30 PM
బిక్కవోలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి సభ్యులు స్థానిక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద వృద్ధులు, చంటి పిల్లలకు ఉచితంగా పాలు, బిస్కట్లు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ పాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో గల ఔత్సాహికులైన భక్తులు, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిబ్బంది, సమితి సభ్యుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. షష్ఠి కమిటీ అధ్యక్షుడు పల్లివాసు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 3000మందికి పాలు, బిస్కట్లను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాధ్, నువ్వుల వెంకట్రాజు, నువ్వుల బాబ్జి, తోట వెంకటరమణ, నువ్వుల సూర్యచంద్రరావు, మల్లిపూడి గంగాధరరావు, శ్రీ శారదా బాలానందం విధ్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.







