UPDATED 15th APRIL 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పెద్దాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చలివేంద్రాన్ని పార్టీ కార్యకర్తలు ఈ చలివేంద్రం ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీ నారాయణ, కాళ్ళ లక్ష్మీ నారాయణ, నేతల హరిబాబు, పట్టణ కార్యదర్శి సేపేని సురేష్, మద్దాల శ్రీనివాస్, కర్రి నారాయణ, పిల్లా సురేష్, మేకా,శ్రీనివాస్, వర్రే రవి, శెట్టిబత్తుల దుర్గ, కానుబోయిన విజయకృష్ణ, తదితరులు పాల్గోన్నారు.







