* అమర వీరుల ఆశయాల దిశగా పనిచేద్దాం
* శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలి
* సామర్లకోట ఎస్ఐ సుమంత్
UPDATED 21st OCTOBER 2019 MONDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : దేశ భద్రత, సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం అర్పించిన పోలీసు అమర వీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ ఒక్కరూ తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని సామర్లకోట ఎస్ఐ వి.యల్.వి.కె. సుమంత్ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రసన్నఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మెహర్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని మానవహారంగా ఏర్పడి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుమంత్ మాట్లాడుతూ సమాజంలో దేశభద్రత, సమాజ రక్షణలో పోలీసు దళాల పాత్ర ఎంతో కీలకమని, శాంతి భద్రతల కోసం ప్రాణాలను సైతంగా ఫణంగా పెట్టి పోలీసులు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పి. కిషోర్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ ఎ. బాలాజీ, హోంగార్డులు, పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







