పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం

* వైఎస్ఆర్ సీపీ నాయకులు రంగనాధం శ్రీనివాసరావు
* కట్టమూరులో నాడు-నేడు కార్యక్రమానికి భూమి పూజ

UPDATED 13th JANUARY 2020 MONDAY 7:00 PM 

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టి అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగనాధం శ్రీనివాసరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సోమవారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో దశల వారీగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాడు-నేడు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా పాఠశాలలో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, మరమ్మతులు, త్రాగునీరు, పెయింటింగ్, ప్రహరీలు, బ్లాక్ బోర్డు, తదితర అవసరాలను కల్పించాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీను వెంకటరమణ, నల్లల గోవిందు, పడాల చంటిబాబు, రంగనాధం జీవా, బండారు చంటిబాబు, పెంట విజయ కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్ పర్సన్ మేడిద దుర్గ, సభ్యులు మాదిరెడ్డి సత్తిబాబు, లోవలక్ష్మి, పాఠశాల హెచ్ఎం ఎం. సత్యవాణి, ఉపాధ్యాయులు అనివిళ్ల శాస్త్రి, శ్రీరామం, గణేష్, తదితరులు పాల్గొన్నారు.               

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us