ప్రగతిలో ప్రారంభమైన జ్ఞానభేరి క్రీడాపోటీలు

UPDATED 20th DECEMBER 2018 THURSDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా  రెండురోజులపాటు జరిగే పురుషుల, మహిళల ఖోఖో పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, క్రీడా అభివృద్ధికి తమ కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 15 పురుషుల,16 మహిళల టీములు పాల్గొంటున్నాయని, జెఎన్టీయుకె ఆధ్వర్యంలో డిసెంబరు 20, 21 రోజులలో రెండు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కె. పట్టాభిరాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భగా క్రీడాకారులకు కళాశాల డైరక్టర్ ఎం.వి. హరనాధబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జ్ కె. రఘురాం, ఇసిఇ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, కళాశాల పిడి బి. ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us