రెండవ విడత నేతన్న నేస్తం... జిల్లాలో 6,878 మందికి లబ్ధి

UPDATED 20th JUNE 2020 SATURDAY 9:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): వైఎస్ఆర్ నేతన్న నేస్తం రెండవ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లిలో ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ (డబ్యు) జి. రాజకుమారి, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్‌, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీన జిల్లాలో 6964 మంది లబ్ధిదారులకు రూ.16.71 కోట్లు వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేశామని, రెండవ విడత కింద 6,878 మందికి రూ.16.50 కోట్లు అందచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ఆర్ నేస్తం ద్వారా లబ్ధి పొందుతున్న కపిలేశ్వరపురం మండలం, అంగర గ్రామానికి చెందిన వాసా సత్యవతి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు ఎన్‌ఎస్‌ కృపావరం, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us