యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

UPDATED 21st JUNE 2019 FRIDAY 9:00 PM

రాజానగరం: యోగా భారతీయుల జీవన విధానమని, యోగాతో చక్కని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ పేర్కొన్నారు. స్థానిక గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా జీవనం సాగించడానికి యోగా ఉత్తమ మార్గమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం దినచర్యగా అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులు యోగా, ధ్యాన సాధనతో పాటు బ్రహ్మి ముహూర్తంలో చదివితే విద్య బాగా వంట పడుతుందన్నారు. జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ఉండేందుకు యోగా, ధ్యానం దోహదం చేస్తాయని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల వ్యాయమ అధ్యాపకుడు డి. సూర్యనారాయణ, పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శివ విద్యార్థులకు యోగాసనాలు ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీగౌరీరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి. సత్యనారాయణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అలాగే గైట్ పాలిటెక్నిక్, గైట్ అటానమస్ కళాశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివి ప్రసాద్, డాక్టర్ పిజి రామానుజం, విభాగాధిపతి యు. కుసుమకుమారి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై. శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us