శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 28th MAY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: మహిళా సంఘాల సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకుని మంచి వ్యాపారస్థులుగా ఎదగడానికి మెప్మా శిక్షణ ఇస్తున్నట్లు రీజినల్ మేనేజర్ శివరాం అన్నారు. స్థానిక టిటిడిసిలో మెప్మా సిబ్బందికి రెండు రోజులు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన సోమవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాల ద్వారా రుణ పథకాలను సమాఖ్యలు సద్వినియోగం చేసుకుని ప్రచారం కల్పించాలని, మహిళా సంఘాలకు రూ. ఐదు లక్షలు నుంచి రుణాలు అందించడం జరుగుతోందని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, రవిశంకర్, ఎస్ఎంసి ప్రభావతి, పి వెంకటలక్ష్మి, కె. సుధారాణి, పి. శైలజ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us