చిన్నయ్యదొర అనే నేను విజయం సాధించడం తథ్యం

* నా ఒక్క ఓటుతోనే గెలుస్తాడా  అనే అపోహ వద్దు.

* నేను ఓటు వేస్తే చిన్నయ్యదొర గెలుస్తాడు అని మీరు అనుకుంటే నా విజయం ఖాయం*

* పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజల నుంచి లభిస్తున్న ఆదరాభిమానాలు

* వేల మైళ్ళ దూర ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభం

* మీ ఒక్క ఓటుతో విజయం తథ్యం 

*డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర

UPDATED 6th APRIL 2019 SATURDAY 9:00 PM

సామర్లకోట : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర ప్రచార జోరు పెంచారు. జై భారత్ నేషనల్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా ఆయన పెద్దాపురం నియోజక వర్గంలోని సామర్లకోట మండలం పి. వేమవరం, బోయినపూడి, నవర, పవర, పండ్రవాడ తదితర గ్రామాల్లో శనివారం విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాలు, వార్డుల్లో తిరుగుతూ జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొరకు దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ గుర్తు గాజులు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఆయన ప్రచారానికి  ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ గ్రామాలకు వచ్చిన ఆయనకు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో జై భారత్ పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ నా ఒక్క ఓటుతో గెలుస్తాడా అనుకోవద్దని, ఒక్క ఓటుతో గెలిపిస్తాను అని ఓటు వేస్తే విజయం తథ్యం అన్నారు.  చిన్నయ్యదొర అను నేను అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జివివి సత్యనారాయణ, కె. అబ్బాస్, సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

* పార్టీలో భారీ చేరికలు
పెద్దాపురం మండలంలోని కట్టమూరు, తిరుపతి, ఆర్భీ పట్నం, ఆర్బీ కొత్తూరు గ్రామాల్లో చిన్నయ్యదొర సమక్షంలో సుమారు 400 మంది పార్టీలో చేరారు. స్థానికుడిగా ప్రజా సేవ చేసే ఆయన ఆశయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us