UPDATED 16th JULY 2020 THURSDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ఆషాఢమాస ఏకాదశి తిథిని పురస్కరించుకుని పెద్దాపురం మరిడమ్మ దేవస్థానంలో అమ్మవారిని గురువారం చామంతి పూలతో విశేషంగా అలంకరించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి విశేష అర్చనలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు.







