UPDATED 27th JUNE 2018 WEDNESDAY 9:00 PM
రాజానగరం: తమ కళాశాలకు చెందిన ఇద్దరు పిజి విద్యార్థులు వర్రే దివ్య, బొజ్జా నిధి ప్రతిభ అవార్డులు అందుకున్నట్లు గైట్ అటానమస్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లీలావతి తెలిపారు. బుధవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గైట్ అటానమస్ కళాశాలలో ఎంటెక్ విద్యార్థిని వర్రే దివ్య, ఎంబిఎ విద్యార్థిని బొజ్జా నిధి ప్రతిభా అవార్డు 2017 పొందారన్నారు. కాకినాడలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జె.ఎన్.టి.యు వైస్ ఛాన్సలర్ ఎస్. రామకృష్ణారావు అవార్డు క్రింద ప్రశంసాపత్రం, మెడల్, నగదు పురస్కారం అందచేశారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులను చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశివర్మ, సిఇవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, డైరెక్టర్ డాక్టర్ టి.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. మూర్తి, తదితరులు అభినందించారు.







