భీమేశ్వరుని సన్నిధిలో హైకోర్టు జడ్జి

UPDATED 17th NOVEMBER 2018 SATURDAY 10:30 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణా హైకోర్టు జడ్జి బి. శివశంకరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం బాలాత్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు. ఆలయ నంది మండపంలో ఆయనకు వేదపండితులు వేదస్వస్థి చేసి ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us