పేదరిక నిర్మూలనతోనే మానవ హక్కుల పరిరక్షణ

UPDATED 10th DECEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా మానవ హక్కులను పరిరక్షించవచ్చని పెద్దాపురం సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ అన్నారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సిరి దివ్యాంగుల పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి రత్నకుమార్ మాట్లాడుతూ భిక్షగాడు నుంచి ప్రతీ ఒక్కరూ తమ హక్కులను అనుభవించేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉందని, మానవ హక్కులను అందరూ గౌరవించడమే కాకుండా వాటిపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. సిరి దివ్యాంగుల పాఠశాల, పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో గల శాంతివర్థన దివ్యాంగుల పాఠశాలకు నెలకు రెండుసార్లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సందర్శించే విధంగా ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి విద్యార్థులకు తినిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, కుంచే నానిబాబు, జుత్తుక అప్పారావు, న్యాయవాదులు విశాలాక్షి, మడికి రాంబాబు, బిఎస్ఎన్ మూర్తి, కెవివి లక్ష్మి, రెహమాన్ ఎ. కృష్ణ భాస్కరరావు, పారా లీగల్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us