నవరత్నాలతో కొత్త వెలుగు

* వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని తోట వాణి విస్తృత ప్రచారం 
* అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం

UPDATED 29th MARCH 2019 FRIDAY 9:00 PM 

సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తోట వాణి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక బలుసులపేట పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద గల వైఎస్ఆర్ సిపి కార్యాలయం వద్ద శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ ధర్మకర్త నేతల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు సుమారు 50 మంది వైఎస్ఆర్ సిపిలోకి చేరారు. వారికి  తోట వాణి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పట్టణ పరిధిలో గల పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పేద ప్రజల సొంతింటి కల నిజం అవుతుందని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పదిహేనో వార్డు సత్యనారాయణపురంలో ఎఫ్ సి ఐలో ఉన్న కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీలమ్మ చెరువుగట్టు వద్ద పరిస్థితిని కార్యకర్తలు తోట వాణికి వివరించారు. గత కొన్నేళ్లుగా అభివృద్ధి పేరుతో నీలమ్మ చెరువుగట్టు వద్ద ఉన్న మట్టిని తొలగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకురాలు పి. విజయలక్ష్మి, తోట ప్రదీప్, తోట వాణి కుమారుడు తోట రాంజీ, పార్టీ నాయకులూ మద్దాల శ్రీను, సేపేని సురేష్, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజేష్, నేతల వెంకటలక్ష్మి, నేతల హరిబాబు, పితాని కృష్ణ, డాక్టర్ పసల సత్యానందం, పాగా సురేష్ కుమార్, నక్కా జానకిరామయ్య, మసకపల్లి సత్యనారాయణ, ఎస్. భావన్నారాయణ, శెట్టిబత్తుల దుర్గ, చిత్తూరు లక్ష్మణరావు, లోవాచారి, ఎలిజిబెత్ రాణి, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us