UPDATED 26th SEPTEMBER 2019 THURSDAY 8:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ తటవర్తి సతీష్ గీతం యూనివర్సిటీ (విశాఖపట్నం) నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (డాక్టరేట్) పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. గీతం ఇంజనీరింగ్ కళాశాల (విశాఖపట్నం) కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ కె. తమిరెడ్డి నేతృత్వంలో సతీష్ సమర్పించిన సం క్లాసిఫికేషన్ అల్గోరిథిమ్స్ టు ప్రెడిక్ట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ రీసెర్చ్ ఆన్ స్టూడెంట్స్ అకాడమిక్స్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్లేస్ మెంట్స్ థీసిస్ కు గాను డాక్టరేట్ పొందారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ఎ. రామకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది డాక్టర్ సతీష్ ను అభినందించారు.







