వల్లూరులో ఉచిత వైద్య శిబిరం

UPDATED 26th NOVEMBER 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : సామర్లకోట మండలం వేట్లపాలెం శివారు వల్లూరులో ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సీహెచ్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 45 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనలక్ష్మి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ఎం. నాగమణి, ఏసు రత్నం, ఏఎన్ఎంలు సత్య నాగవేణి, వెంకటలక్ష్మి, రమాకుమారి, తదతరులు పాల్గొన్నారు. అనంతరం ఈ శిబిరాన్ని మాజీ సర్పంచ్ కె. రామకృష్ణ సందర్శించి వైద్య సిబ్బందిని అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us