ఆదిత్య బిజినెస్ స్కూల్లో వ్యవస్థాపకతపై కార్యశాల

UPDATED 26th NOVEMBER 2018 MONDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో వ్యవస్థాపకతపై సోమవారం కార్యశాల నిర్వహించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యశాలకు తూర్పుగోదావరి జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ జయబాబు ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలను అందించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు వ్యవస్థాపకులు కావడానికి అవసరమైన ముఖ్యమైన అంశాలను వివరిస్తూ కష్టపడే స్వభావం అలవర్చుకోవాలని, అనేక అంశాలపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని, నిరంతరం తెలియని విషయాలను నేర్చుకొంటూ దైనందిన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. నగదు లావాదేవీలు, ముడిసరుకులు లభ్యత ఆధారంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించినపుడు మాత్రమే వ్యాపారం సక్రమంగా క్రమపద్దతిలో లాభదాయకంగా సాగుతుందని సూచించారు. డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు వ్యాపారరంగంలో వస్తున్న మార్పులను గమనించాలని, తరచు పారిశ్రామిక రంగంలో ఉన్న అనుభవజ్ఞుల సూచనలు పాటిస్తూ పరిశ్రమలను సందర్శించి ప్రత్యేక్షంగా జ్ఞానం సంపాదించి సరైన అవగాహనతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, అధ్యాపక సిబ్బంది, బిబిఏ, ఎంబిఏ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us